తాడేపల్లి (గుంటూరు) : నేడు వినాయకచవితి పండుగ సందర్భంగా ... సిఎం వైఎస్.జగన్ రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ' ఈ వినాయకచవితినాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ' అని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు.










