Dec 26,2022 08:17

ఇప్పుడు మనిషి ఒక్కడే
దేవుళ్లే అనేకం
కులానికి ఒక దేవుడు
మతానికి మరో దేవుడు
వర్గానికి ఇంకో దేవుడు

ఆకలి కడుపుతో
మనిషి సతమతమౌతుంటే
మొదటి నైవేద్యం దేవుడికి
చింపిరి బట్టలు మనిషివైతే
పట్టువస్త్రాలు దేవ దేవునికి
కళ్ళముందున్న ఆకలి తీరదు
గర్భగుడిలో కదలలేని దేవునికి మాత్రం
అంగ రంగ వైభోగాలు !

మన చుట్టూ ఎందరో అభాగ్యులున్నా
సాయం చేసే చేతులు సున్నా
పాప భీతితో మాత్రం
దేవుని హుండీకి చేరే నజరానా
గుడిమెట్లపైనే ఆకలి చూపుల హైరానా

హుండీలో నక్కిన నోటు
చేరునా ఆకలి కడుపుల వరకూ
మనష్యుల్ని మరచిన మనసులకు
మనుషులు చేసిన దేవుళ్ళకే అగ్ర తాంబూలం
సిగ్గుచేటు..!

- మహబూబ్‌ బాషా చిల్లెం
9502000415