Nov 21,2022 21:27

న్యూఢిల్లీ : టెక్నాలజీ స్టార్టప్‌ మ్యాటర్‌ దేశంలోనే తొలిసారి గేర్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌బైక్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఫ్యూచర్‌ ఆఫ్‌ రైడింగ్‌ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. విప్లవాత్మక, పేటెంటెడ్‌ యాక్టివ్‌ లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌, కలిగి ఉందని పేర్కొంది. ఆన్‌బోర్డ్‌ చార్జర్‌, మ్యాటర్‌ చార్జ్‌ 1.0ను కలిగి ఉన్న ఈ వాహనాన్ని ఎక్కడైనా సరే 5 యాంప్స్‌ ప్లగ్‌ కలిగి ఉంటే చార్జ్‌ చేయవచ్చని పేర్కొంది. దీనికి త్వరలోనే బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.