Oct 02,2023 10:06

తాడేపల్లి : జాతిపిత మహాత్మాగాంధీ 154 వ జయంతిని పురస్కరించుకొని ... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ అకౌంట్‌లో సందేశం తెలిపారు.

'' మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు. '' అని గాంధీ ఫోటోను పెట్టారు.

 

;