Oct 17,2023 12:27

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పాడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు సముద్రంలో గల్లంతయినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం ... ఉప్పాడ కు చెందిన వంక కృపారావు (28 ) సోమవారం అమీనాబాద్‌ రేవు వద్ద నుండి సముద్రంపై వేటకు వెళ్లాడు. ఈరోజు తెల్లవారుజామున ఓడలరేవు సమీపంలో తోటి మత్స్యకారులతో వేటాడుతుండగా వలతాడుకు చిక్కుకొని ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. దీంతో తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన కృపారావుకు పాప, బాబు ఉన్నట్లు తెలిపారు. మత్స్యకారుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.