- వెనుకబడిన ప్రాంతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యం
- బిజెపి జపం చేస్తున్న వైసిపి, టిడిపి ప్రజలకు సమాధానం చెప్పాలి : గఫూర్
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : రాష్ట్రాభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిం చిందని, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృ ద్ధికి నిధులు కేటాయించడం లేదని అన్నారు. బిజెపి విధానాలను సమర్థిస్తోన్న రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ప్రజలకు సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా సమాగ్రాభి వృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యాన 11 రోజులపాటు నిర్వహించిన మూడు పాదయాత్రలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ నుంచి నర్తకి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో గఫూర్ మాట్లాడుతూ కేవలం బటన్ నొక్కేందుకే అయితే ముఖ్యమంత్రి అవస రమా? ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిని విస్మరించడం తగదన్నారు. గత నాలుగన్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని, పైగా, రాష్ట్ర ప్రభుత్వ తీరువల్ల ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మృగ్యమవడంతో చదువుకున్న యువ త ఉద్యోగాల కోసం చెన్నరు, బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించు కున్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మివేయాలని, నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, పొలవరానికి నిధులు రాబట్ట డంతో పూర్తిగా విఫలమైందన్నారు. బిజెపి విధా నాలకు వైసిపి, టిడిపి, జనసేన మద్దతు తెలుపుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని, దీనిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌రావు, గోగుల శ్రీనివాసులు, కె.అజరు కుమార్ తదతరులు పాల్గొన్నారు.










