నైరోబి: కెన్యా వేదికగా జరిగిన అథ్లెటిక్స్ మీట్‌కు జమైకాకు చెందిన స్టార్ స్ప్రింటర్ షెల్లోఅన్ ఫ్రేజర్ ప్రైస్ దూరమైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ మీట్‌కు గాయం కారణంగా పాల్గనడం లేదని ఫ్రైసర్ ప్రైస్ వెల్లడించింది. 'తూర్పు ఆఫ్రికాలో ఒక గొప్ప అథ్లెటిక్ ఈవెంట్‌తో నా సీజన్‌ను ప్రారంభించాలని ఎదురుచూస్తున్నా' అని ఫ్రేసర్ ఆ ప్రకటనలో పేర్కొంది. గురువారం నైరోబీలోని కసరానీ స్టేడియంలో శిక్షణ సమయంలో ఫ్రైజర్ ఫ్రైస్ మోకాలికి తీవ్ర గాయమైనట్లు కిప్‌ాకీనో క్లాసిక్ డైరెక్టర్ బార్నబాస్ కోరిక్ తెలిపారు. మహిళల 100మీ. స్ప్రింట్‌లో ఫ్రైజర్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. గత ఏడాది కిప్ కీనోలో జరిగిన 100మీ. స్ప్రింట్‌ను 10.67సెకన్లలో గమ్యానికి చేరి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. గత వారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో 100మీ. స్ప్రింట్‌లో అమెరికాకు చెందిన రిచర్డుసన్ విజేతగా నిలిచింది.










