Sep 20,2023 15:28

హైదరాబాద్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అర్పివేశారు. అగ్ని ప్రమాద సమయంలో రూమ్‌లో ఉన్న మందులు, వస్తువులు కాలి బూడిద అయ్యాయి. అలాగే మందులు నిల్వ చేసే రెండు ఫ్రిడ్జీలు సైతం దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తక్షణమే స్పందించి మంటలను ఆర్పిన సిబ్బందిని పలువురు అభినందించారు.