ప్రజాశక్తి- కలకడ(అన్నమయ్యజిల్లా) : కలకడ సచివాలయం పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో కాపురం ఉంటున్న షేక్ సైఫుల్ల అనారోగ్యంతో సోమవారం మతి చెందాడు.అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్సార్ బీమా పథకం కింద పదివేల రూపాయలు తక్షణ సాయంగా రూ.10వేలు అందజేసినట్లు ఎంపీడీవో సిహెచ్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మునీంద్ర నాయక్ , ఏపీఎం రమేష్.సచివాలయ సిబ్బంది శ్రీనివాసులు, వైసిపి నాయకులు షావత్ అలీ ఖాన్, జిలాని భాష, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.










