హైదరాబాద్ : శామీర్‌పేటలోని ఓఆర్‌ఆర్‌పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిలిచి ఉన్న లారీని ఇన్నోవా వాహనం వెనుక నుంచి వచ్చి ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని పోలీసులు 108లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు డ్రైవర్ మరుతి, ప్రయాణికుడు రాజుగా గుర్తించారు. వీరు కుత్బుల్లాపూర్ వాసులు. కీసర నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుని దర్యాప్తు జరుపుతున్నారు.










