Sep 17,2023 07:57

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు (ప్రకాశం) : ఆగిఉన్న కంటైనర్‌ ను బైక్‌ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని మద్దిరాలపాడు వద్ద 216వ జాతీయ రహదారిపై జరిగింది. మృతులు పమిడిపాడు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం ... కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మర్రిబోయిన మణికంఠ (21), బత్తిన అరవింద్‌ (19), మర్రిబొయిన గోపి (27) కలిసి ఒంగోలు వినాయక విగ్రహం కోసం బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా, మద్దిరాలపాడు వద్ద ఆగిఉన్న కంటైనర్‌ ను బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో గోపికి వివాహమయ్యింది. భార్య, సంవత్సరం వయస్సు ఉన్న కుమార్తె ఉంది. యువకుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. మూడు కుటుంబాలు దు:ఖసాగరంలో మునిగాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.