Oct 03,2023 10:42

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని కలిసేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు మంగళవారం రాజమండ్రికి బయలుదేరారు. తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాల్లో బయలుదేరారు. చంద్రబాబును వైసిపి ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టిందని.. ఇలాంటి సమయంలో తామంతా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని రైతులు చెప్పారు. మధ్యాహ్నం తర్వాత వీరంతా రాజమండ్రికి చేరుకుని నారా భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి తమ సంఘీభావం తెలపనున్నారు.