అనంతపురం : మాజీ మంత్రి, టిడిపి నాయకురాలు పరిటాల సునీత చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ... అనంతపురం పరిధిలోని పాపంపేటలో రెండు రోజుల నుంచి సునీత దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన టిడిపి నేతలను అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న రాత్రి దీక్షా శిబిరం వద్ద వైసిపి నేతలు రెక్కీ నిర్వహించారని పరిటాల సునీత ఆరోపించారు. అదే సమయంలో వైసిపి నేత వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టిందని.. వైసిపి నేత అమర్నాథ్ రెడ్డికి చెందిన వాహనంగా గుర్తించామని పరిటాల వర్గీయులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.










