Jun 29,2023 21:30

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమి ఇండియా భారీగా ఉద్యోగుల కోతలకు దిగనుందని తెలుస్తోంది. దేశంలోని సిబ్బందిపై వేటు వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని సమాచారం. గత కొన్ని వారాలుగా 30 మందిని తొలగించిన ఈ సంస్థ.. వచ్చే కొద్ది రోజుల్లో వందల సంఖ్యలో ఉద్వాసనలకు పాల్పడనుందని తెలుస్తోంది. భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను 1000 దిగువనకు తగ్గించుకోవాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఆ సంస్థలో 1500 మంది పని చేస్తున్నారని అంచనా.