Dec 19,2022 21:04

వాషింగ్టన్‌ : ట్విట్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా ఉండాలా..? వద్దా..? అనే అంశంపై ఎలన్‌ మస్క్‌ నిర్వహించిన ఆ పోల్‌లో ఆ సోషల్‌ మీడియా వినియోగదారులు ఆయనకు ఊహించని షాక్‌ ఇచ్చారు. మస్క్‌ సిఇఒగా వద్దు అంటూ 57.5 శాతం మంది యూజర్లు ఓటు వేయగా.. 42.5 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. ఈ పోల్‌లో 1.75 కోట్ల మంది పాల్గొన్నారు. యూజర్లు చెప్పే దానికి కట్టుబడి ఉంటానని పోల్‌కు ముందు ఎలన్‌ మస్క్‌ ఇచ్చిన వాగ్దానంపై నిలుచుంటారో లేదో వేచి చూడాలి. ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలన్‌ మస్క్‌ ఉద్యోగుల తొలగింపు, విధాన అంశాల్లో చాలా వివాదస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.