హైదరాబాద్ : మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఆయనకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. ఇప్పడు మూడోసారి నోటీసులు పంపారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్‌కు సంబంధాల విషయంలో ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. మరోవైపు గత నెల 23న మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీస్‌ను నార్కోటిక్స్ పోలీసులు 6 గంటల పాటు విచారించిన విషం తెలిసిందే.










