Sep 10,2022 12:19

బేగంబజార్‌ (హైదరాబాద్‌) : హైదరాబాద్‌లో జరుగుతున్న వినాయక నిమజ్జనాలలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ లారీ వెనుక చక్రాల కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. నగరంలోని శాలిబండ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు జైసాయి శుక్రవారం తెల్లవారుజామున గణేశ్‌ నిమజ్జనం ముగించుకొని తిరిగి లారీపై ఇంటికి వెళుతున్నాడు. అబిడ్స్‌ చర్మాస్‌ వద్దకు రాగానే జైసాయి లారీ పై నుంచి ప్రమాదవశాత్తు జారి లారీ వెనుక చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అబిడ్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.