హైదరాబాద్ : దేశ ప్రధానమంత్రి మోడి మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్న వేళ ... తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ ట్విటర్ వేదికగా ప్రధానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.
'' మా 3 ప్రధాన హామీల సంగతేంటి ?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?
బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?
పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు ?
మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. ఆ 3 విభజన హక్కులకు దిక్కేది ?
పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు ? గుండెల్లో గుజరాత్ పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ? '' అని కెటిఆర్ ప్రశ్నించారు.










