బెంగళూరు: దులీప్ ట్రోఫీ ప్లే-ఆఫ్‌లో నార్త్, సెంట్రల్ జోన్ జట్లు విజయం సాధించాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌జోన్ జట్టు 511పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్‌జోన్‌పై, ఆలూరు కస్కా క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ జట్టు 170పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించాయి. నార్త్ ఈస్ట్‌జోన్ నిర్దేశించిన 666పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నార్త్-ఈస్ట్‌జోన్ జట్టు 154పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 3వికెట్ల నష్టానికి 58పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ ఈస్ట్‌జోన్‌జట్టు నార్త్‌జోన్ బౌలర్ల దెబ్బకు కుదేలైంది. మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ నిర్దేశించిన 300పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈస్ట్‌జోన్ జట్టు 129పరుగులకే కుప్పకూలింది. బుధవారం నుంచి సౌత్‌జోన్-నార్త్‌జోన్, వెస్ట్‌జోన్-సెంట్రల్ జోన్ జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరగనున్నాయి.










