Oct 17,2023 11:06

అమరావతి : ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సన్నిహితులు, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేశ్‌ మంగళవారం సిఐడి విచారణకు హాజరుకావల్సి ఉంది. ఈరోజు ఉదయం 10 గంటలకు డాక్యుమెంట్లు తీసుకురావాలని నిన్న సిఐడి రాజేష్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ... ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్లు తీసుకురావడం సాధ్యం కాదని.. దసరా పండగ తర్వాత డాక్యుమెంట్లు తీసుకొస్తాననీ.. తనకు సమయం ఇవ్వాలని కోరుతూ రాజేష్‌ సిఐడి అధికారులకు లేఖ రాశారు. నైపుణ్యాభివృద్ధి కేసుకు సంబంధించి సోమవారం కిలారు రాజేష్‌ సిఐడి విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిఐడి ఆర్థిక నేరాల విభాగం-2 (సిట్‌) కార్యాలయంలో నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు రాజేశ్‌ను ప్రశ్నించారు. మళ్లీ ఈరోజు విచారణకు హాజరుకావాలని రాజేశ్‌కు సిఐడి నోటీసు ఇచ్చిందని రాజేశ్‌ మీడియాకు తెలిపారు.