అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను ఈ నెల 12కు న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటివరకూ లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. స్కిల్ కేసులో లోకేశ్ పేరు చేర్చలేదని గత విచారణలో హైకోర్టుకు సీఐడీ తెలిపింది. అయితే, సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారని లోకేశ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే పిటిషనర్‌ను అరెస్టు చేస్తారని ముందస్తు బెయిల్ దాఖలు చేశారని తెలిపారు.










