- లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన సిఎం జగన్
ప్రజాశక్తి -తిరుమల : వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టిటిడి చరిత్రలో ఒక మహత్తర ఘట్టమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో టిటిడి ఉద్యోగులకు సోమవారం ఆయన ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మొత్తం 6,700 మంది టిటిడి ఉద్యోగులు ఉన్నారని, ప్రస్తుతం రూ.313 కోట్ల వ్యయంతో 3,518 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మిగిలిన ఉద్యోగులకూ రూ.280 కోట్ల వ్యయంతో 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. టిటిడి చైైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో టిటిడి ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరయ్యాయని, తిరిగి వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో ఇళ్లస్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. తండ్రీ కొడుకుల హయాంలో టిటిడి బోర్డు చైౖర్మన్‌గా తాను పని చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. టిటిడి ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు సిఎంకు కతజ్ఞతలు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు చిన్నశేష వాహనంపై మలయప్ప
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారిని ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారక కృష్ణుడి అలంకారంలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగాకోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సిఎం గజన్ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి తిరుమలలోనే బస చేశారు. మంగళవారం మరోసారి శ్రీవారిని సిఎం జగన్ సందర్శించారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇఫ్తికాఫల్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు సోమవారం చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు వెళ్లారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీవారిని సందర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కె రోజా, జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.










