ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ మండలం జన్నలగడ్డ గ్రామంలోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు క్రికెట్ కిట్ల బహుమతీకరణ జరిగింది. ఆదివారం రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బల్లా రామకృష్ణ జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం జన్నలగడ్డ గ్రామంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు క్రికెట్ కిట్లను బహుమతిగా అందచేశారు. ప్రభుత్వ హాస్టల్‌ను పరిశీలించి హాస్టల్ వార్డెన్‌తో చర్చించారు. హాస్టల్ విద్యార్థులు ఆటలతోపాటు చదువులో కూడా ముందుండాలని బొల్లా రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మన్నే కళావతి, లగడపాటి వీరాంజనేయులు, లగడపాటి బాబి, లగడపాటి రామకృష్ణ, బొమ్మినేని వంశీకృష్ణ, లగడపాటి అప్పారావు, ఉపసర్పంచ్ గడ్డం రవి, శ్రీనివాసరావు, లగడపాటి సురేష్, పివి రాజు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.










