తెలంగాణ : దసరా పండుగ రానున్న వేళ ... తెలంగాణ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. నేటి నుండి ఈ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణలో దసరా పెద్ద పండుగ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను పేర్చి గౌరమ్మను మహిళలు పూజిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహిళలకు బతుకుమ్మ చీరలను పంపిణీ చేస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చీరలు పంపిణీ చేసేందుకు సమాయత్తం కావడంతో ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలు చేరాయి. ఈ ఏడాది చేనేత సంఘాల ఆధ్వర్యంలో రూ.354 కోట్లతో 1.02 కోట్ల చీరలను బాలికలకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. టెక్స్‌టైల్ శాఖ గతంలో కంటే ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను తయారు చేసింది. ఈ బతుకమ్మ చీరలను 250 డిజైన్లలో జరీ, వివిధ రంగుల కాంబినేషన్లతో ఆకర్షణీయంగా తయారు చేశారు. తమ శాఖ 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను థ్రెడ్ బార్డర్‌తో తయారు చేసిందని అధికారులు తెలిపారు.










