Oct 09,2023 11:36

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన అంగళ్లు, ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మూడు కేసులపై హైకోర్టు ఇటీవల విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తాజాగా ఆ మూడు ముందస్తు బెయిల్‌ కేసుల పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పును వెలువరించారు. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది. ఇటీవల విచారణ చేపట్టిన విజయవాడలోని ఎసిబి కోర్టు.. తీర్పును నేటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్‌, సిఐడి కస్టడీపై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.