Jun 28,2023 21:52
  • ఈస్ట్‌ జోన్‌తో దులీప్‌ ట్రోఫీ

బెంగళూరు: నార్త్‌ ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీలో నార్త్‌జోన్‌ జట్టు భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 306పరుగులు చేసింది. ధృవ్‌ షోరే(135) సెంచరీకి తోడు నిషాంత్‌ సింధూ(76నాటౌట్‌) అర్ధసెంచరీతో మెరిసాడు. ఓపెనర్‌ ధృవ్‌ షోరే సెంచరీతో మెరిసినా.. అంకిత్‌ కల్పి(0), అంకిత్‌ కుమార్‌(9), కెప్టెన్‌ జయంత్‌ యాదవ్‌(0) నిరాశపరిచారు. ప్రభుసిమ్రన్‌ సింగ్‌(31), ప్రశాంత్‌ చోప్రా(32) ఫర్వాలేదనిపించారు. జోటిన్‌, కిషన్‌ సింఘూకు రెండేసి వికెట్లు దక్కాయి.

  • సెంట్రల్‌ జోన్‌ 182ఆలౌట్‌

మరో మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్‌ బౌలర్ల దెబ్బకు సెంట్రల్‌ జోన్‌ జట్టు 182పరుగులకే కుప్పకూలింది. హిమాన్షు(29), రింకు సింగ్‌(38) బ్యాటింగ్‌లో రాణించారు. మురాసింగ్‌(5/42), ఆవేశ్‌ ఖాన్‌(2/13) బౌలింగ్‌లో మెరిసారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఈస్ట్‌జోన్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 32పరుగులు చేసింది. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌(0), శంతను మిశ్ర(6) నిరాశపరిచారు. సుదీప్‌ కుమార్‌(19), షాబాజ్‌ నదీమ్‌(6) క్రీజ్‌లో ఉన్నారు. ఆవేశ్‌ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.