ప్రజాశక్తి-నందిగామ : 11న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కే గోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం గోపాల్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఎం పేరిట పట్టణంలో వివిధ వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నామన్నారు. 18వ వార్డ్ లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, 7,8 వార్డులో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 18వ వార్డులో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని, పట్టణంలో కూడా ఉపాధి హామీ పని అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గహాలకు 200 యూనిట్ల విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారంపై ఈ నెల 11న కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసీం, కర్రీ వెంకటేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, జంగా దామోదర్, బత్తుల వెంకటేశ్వర్లు, ఉప్పు శీను, ఉపుతోళ్ల పుల్లయ్య, ఉపుతోళ్ల కుమారి, రోశయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.










