Oct 03,2023 12:28

నెల్లూరు : నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికై ... సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం సీతారాంపురం మండలం బసినేనిపల్లి గ్రామంలో ప్రారంభమైంది. ఈ యాత్రను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ... సీతారాం సాగర్‌ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంతాలకు సాగు తాగునీరు అందించాలని కోరారు. శిలాఫలకాలకే పరిమితమైన మెట్ట ప్రాంతపు అభివృద్ధి అని... ఇది ఎవరి శాపం ? పాలకుల పాపమా ? ముమ్మాటికీ పాలకుల పాపమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతాలను అభివృద్ధి చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి పోరాటాలు ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు.