హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాల రీత్యా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది.










