Sep 19,2023 14:36

రామగిరి : హైదరాబాద్‌ లో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ స్టేట్‌ కాన్ఫరెన్స్‌ లో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని చందనాపూర్‌ గ్రామ సర్పంచ్‌ దాసరి శంకరయ్య జాతీయ ఉత్తమ సర్పంచ్‌ అవార్డ్‌ కు ఎంపికయ్యారు. ఎంపికైన చందనాపూర్‌ సర్పంచ్‌ దాసరి శంకరయ్య కు అక్టోబర్‌ 15 న దేశ రాజధాని ఢిల్లీ లో 1000 మంది డెలిఘేట్లతో అవార్డు అందుకోనున్నట్లు శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శంకరయ్య మాట్లాడుతూ, ఉత్తమ సర్పంచ్‌ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవార్డు రావడానికి గ్రామ ప్రజలు అదేవిధంగా జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ సహకారం ఉందని ఆయన అన్నారు. అలాగే రానున్న రోజుల్లో గ్రామాన్ని ప్రజల సహకారంతో మరింత అభివఅద్ధి చేస్తానని ఆయన అన్నారు.