Feb 24,2023 15:01

హవానా :   120 ఏళ్లుగా అమెరికా అక్రమంగా ఆక్రమించిన గ్వాంటనామో  నిర్బంధ శిబిరాన్ని మూసివేయాలని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగజ్‌ గురువారం పేర్కొన్నారు. క్యూబా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా దేశంలోని 117 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అమెరికా ఆక్రమించిందని అన్నారు. ఇటువంటి అక్రమ ఆక్రమణలకు ముగింపు పలకాలని రోడ్రిగజ్‌ పిలుపునిచ్చారు. 1898 స్పానిష్‌-క్యూబా యుద్ధం సమయంలో అమెరికా గ్వాంటనామో బే నౌకాశ్రయాన్ని ఆక్రమించుకుంది. అక్కడి నుండి  ప్యూర్టిరికోను ఆక్రమించుకుని, శాంటియాగో డి క్యూబాపై దాడి చేసింది.  1903 డిసెంబర్‌ నుండి తిరిగి గ్వాంటనామో  నిర్బంధ శిబిరాన్ని ప్రారంభించారు.