యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే నాలుగో రోజు ఆటలో ఆసీస్‌కు లయోన్ అవసరం పడటంతో అతను ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. అతను నొప్పిని భరిస్తూ కుంటుతూ మైదానంలోకి వస్తుంటే, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు. లయోన్ ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ప్రేక్షకులు చప్పట్లతో స్టేడియం మార్మోగింది. ప్రస్తుతం లయోన్ కుంటుతూ మైదానంలోకి వస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.










