Oct 17,2023 21:30

ప్రజాశక్తి -ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు జిల్లా):నారా భువనేశ్వరి, లోకేష్‌, చంద్రబాబు నాయుడులపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టిడిపి, జనసేన నాయకులు చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ థామస్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొన్నా యుగంధర్‌ మాట్లాడుతూ.. నారా, నందమూరి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్యత కాదని హితవు పలికారు. ఎన్‌టిఆర్‌ బమ్మ పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.. మరి మీరు వైఎస్‌ఆర్‌ బమ్మ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ఫిర్యాదు చేసిన వారిలో టిడిపి మండల అధ్యక్షులు గంధమనేని జయశంకర్‌ నాయుడు, రాజశేఖర్‌ నాయుడు, ఆరు మండలాల టిడిపి, జనసేన నాయకులు ఉన్నారు.