Oct 04,2023 07:30

రేపల్లె (బాపట్ల) : మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ రాజుకోవడంతో యువకుడు హత్యకు గురైన ఘటన బుధవారం అరవపల్లి గ్రామ శివారులో జరిగింది. సాయి, హర్ష అనే ఇద్దరు స్నేహితులు మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. ఈ ఘర్షణలో సాయిని హర్ష చంపాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మఅతుడు రేపల్లె పట్టణం 23 వ వార్డుకు చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.