ప్రజాశక్తి-వెదరుకుప్పం (చిత్తూరు) : వెదరుకుప్పం మండలం ఎర్రగుంటపల్లెలో క్వారీ వద్ద మహిళపై చిరుత దాడి చేసింది. దీంతో బాధితురాలు పెద్దగా కేకలు వేశారు. వెంటనే చిరుత పులి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఇక చిరుత దాడిలో గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చిరుత దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు గ్రామంలోకి వస్తుందేమోనని భయపడిపోతున్నారు. పొలాలకు వెళ్తున్న సమయంలో దాడి చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చిరుత పులిని త్వరగా బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.










