Oct 18,2023 15:09

హైదరాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. 2012 ఏడాదిలో విక్రయించిన 2 ఇళ్ల స్థలాలను రెండోసారి అమ్మి, తనను బాపూరావు మోసం చేశారని ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు బాపూరావుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.