ఆదిలాబాద్ : బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2012వ సంవత్సరంలో విక్రయించిన 2 ఇళ్ల స్థలాలను రాథోడ్ మళ్లీ రెండోసారి అమ్మారని.. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. తనను బాపూరావు మోసం చేశారని ఆరోపించారు. దీంతో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో... బాపూరావు, సుదర్శన్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.










