Oct 15,2023 12:09

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఈ ప్రభుత్వ వైఖరి అమానవీయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య సమస్యలపై మానవతాదఅక్పథంతో వ్యవహరించాలని కోరారు. ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్‌ అన్నారు.