Oct 16,2023 13:01

అమరావతి : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. రాజధాని నగర బఅహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదు ఆధారంగా.. ఎపి సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ వేసిన సంగతి విదితమే. ఈ రోజు చంద్రబాబు పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.