Oct 18,2023 12:45

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టులో జరిగిన విచారణ నవంబర్‌ 7 కు వాయిదా పడింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఈ విచారణ నవంబర్‌ 7కు హైకోర్టు వాయిదా వేసింది.