Sep 26,2023 20:48
  • ధ్వజవరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ప్రజాశక్తి -తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. తొమ్మిది గంటలకు ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్‌ భూమణ కరుణాకర్‌ రెడ్డి దంపతులు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దంపతులు, ఇఒ ఎవి ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జెఇఒలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఎస్‌పి పరమేశ్వర్‌రెడ్డి, సివిఎస్‌ఒ నరసింహ కిషోర్‌ పాల్గొన్నారు.