Feb 12,2023 15:57
  • పశువులను జాగ్రత్త చేసుకోవాలి.
  • సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ.

ప్రజాశక్తి-వి.ఆర్.పురం :  మండలంలోని 2022లో వరదలు రావడం వలన మిర్చి పంటలు లేటుగా సాగుచేయడం వలన పంట లేటుగా చేతికి అందే అవకాశాలు ఉన్నాయని పంటలు బాగానే ఉన్నా పశువులను జాగ్రత్త చేసుకోవాలని లేని పక్షంలో మేము నష్టపోవాల్సి వస్తుందని సిపిఎం బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా నాయకులు ఆదివారం రైతులతో కలిసి మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ  మాట్లాడుతూ ఏప్రిల్, మే, నెలవరకు పశువులను బయటికి వదలకుండా కాపు కాచు కోవాలని పశువుల కాపలాదారులకుసూచించారు. సుమారు ఎకరాకు రెండు లక్షల, నుండి మూడు లక్షల, రూపాయల ఖర్చు చేశారని ఆయన తెలిపారు.రైతులు వేసిన పంటలు తెగుళ్లు బారినపడి ఖర్చు విపరీతంగా పెరిగిందని పంటచేతికి వచ్చే వరకు పశువులను కాపు చేసుకోవాలని కోరారు. అధికారులు కూడా స్పందించి సూచనలు ఇవ్వాలని కోరారు లేనిపక్షంలో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని వారు అన్నారు అధికారులు రైతులకు సహకరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం.పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, రైతు సంఘం మండల కార్యదర్శి వడ్లది రమేష్ ,పంకు సత్తిబాబు, నాళ్లారపు ప్రకాష్,పంకు రైతులు కడుపు రాము తెలగాని వెంకన్న బుర్ర శ్రీను సత్యనారాయణ అప్పారావుతదితరులు పాల్గొన్నారు.