Oct 08,2023 11:28

ప్రజాశక్తి-వన్‌ టౌన్‌ (విజయవాడ) : సెంట్రల్‌ నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు సిపిఎం ప్రజా పోరుబాట పాదయాత్ర విజయవాడ వన్‌ టౌన్‌లోని 62వ డివిజన్‌లో ఆదివారం జరిగింది. నేతలు మాట్లాడుతూ ... దేశాన్ని, రాష్ట్రాన్ని ముంచిన బిజెపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను మోసగించిన వైసిపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఇళ్లు, పట్టాలు, కనీస వేతనాలు, నగరాభివృద్ధి, హామీలను విస్మరించిన అధికార ప్రజా ప్రతినిధులను ప్రజలు నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.