Oct 18,2023 10:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19న కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్‌కాలనీ వైడబ్ల్యుసిఎస్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు ఈ సందర్భంగా బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సిఎం మాట్లాడనున్నారు. సిఎం జగన్‌ తాడేపల్లి నుంచి ఉదయం 8:30 గంటలకు ఎమ్మిగనూరుకు బయలుదేరి తిరిగి మధ్యాహ్నానికి తాడేపల్లికి చేరుకుంటారు.