Oct 08,2023 08:43

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకోవడంలో దేశం ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశం గర్వపడేలా స్వర్ణం సాధించిన మన రాష్ట్రానికి చెందిన సాత్విక్‌ సైరాజ్‌తోపాటు దేశం తరఫున పలు క్రీడల్లో పాల్గొ న్న క్రీడాకారులకు సిఎం అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు.