Sep 19,2023 21:18

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :గవర్నరు అబ్దుల్‌ నజీర్‌ అస్వస్తతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతూ తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో సోమవారం చేరారు. గవర్నరు ఆక్యూట్‌ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. రోబో సాయంతో ఆయనకు చేసిన అపెండెక్టమీ అనే సర్జరీ విజయవంతమైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి గవర్నరును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.