Oct 16,2023 11:16

విశాఖ : విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని సిఎం జగన్‌ ప్రారంభించారు. సోమవారం ఉదయం విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి జగన్‌ బయలుదేరి విశాఖపట్టణానికి చేరుకొని ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాసేపట్లో రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. విశాఖలో అభివృద్ధి పనుల శంకుస్థాపనల తరువాత ముఖ్యమంత్రి జగన్‌ అనకాపల్లిలో పర్యటించనున్నారు. అక్కడ పలు ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.