Jun 24,2023 16:36

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ టీ20ల్లో 10000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. డెర్బీషైర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌ తరపున బరిలోకి దిగిన బట్లర్‌.. 39 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బట్లర్‌ 10000 పరుగుల ల్యాండ్‌ మార్క్‌ను రీచ్‌ అయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో 10000 పరుగులు సాధించిన తొమ్మిదో ఆటగాడిగా బట్లర్‌ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్‌ గేల్‌ (14562), షోయబ్‌ మాలిక్‌ (12528), కీరన్‌ పోలార్డ్‌ (12175), విరాట్‌ కోహ్లి (11965), డేవిడ్‌ వార్నర్‌ (11695), ఆరోన్‌ ఫించ్‌ (11392), అలెక్స్‌ హేల్స్‌ (11214), రోహిత్‌ శర్మ (11035) నిలిచారు. కాగా టీ20 కెరీర్‌లో మొత్తం 372 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌.. 34.16 సగటున, 144.70 స్ట్రయిక్‌ రేట్‌తో 6 శతకాలు, 21 హాఫ్‌ సెంచరీల సాయంతో 10080 పరుగులు చేశాడు.