Oct 05,2023 16:02

అమరావతి: తెలుగుదేశం ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జ్‌ బుద్దా వెంకన్నకు సీఆర్పీసీలోని 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇటీవల గన్నవరంలో జరిగిన సభలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , కొడాలి నానిలపై బుద్దా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆత్కూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో బుద్ధా వెంకన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్‌లు అన్నీ ఏడు సంత్సరాలు శిక్ష పడేవిగా ఉన్నాయని వెంకన్న తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... బుద్దా వెంకన్నకు సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్‌ క్రింద నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.