Sep 24,2023 14:53

విశాఖపట్నం: విశాఖ నుంచి కొత్తవలస- కిరండూల్‌ (కేకే) లైన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మనబార్‌-జరాతి స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కేకే లైన్‌లో వెళ్లాల్సిన ఏడు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.